Friday, November 22, 2024

యువరాజ్ సింగ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Yuvaraj Singh
ఛండీగఢ్: హర్యానా పోలీసులు ఆదివారం మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. కులపరమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పంజాబ్, హర్యాన హైకోర్టు ఓ కేసులో ఉత్తర్వులు జారీచేయడంతో పోలీసులు యువరాజ్‌ను అరెస్టు చేశారు. “యువరాజ్ సింగ్ శనివారం హన్సీకి వచ్చారు.మేము లాంఛనప్రాయంగా ఆయనని అరెస్టు చేశాము. అయితే కొన్ని గంటలకే ఆయనను బెయిల్‌పై విడిచిపెట్టాము” అని హన్సీ డిఎస్‌పి వినోద్ శంకర్ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో యువరాజ్ సింగ్ మరో క్రికెటర్‌ను ఉద్దేశించి కులపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హన్సీకి చెందిన వ్యక్తి ఒకరు ఆరోపించారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు మేరకు యువరాజ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తాను చేసిన వ్యాఖ్యలపై యువరాజ్ ఇదివరకే పాశ్చాత్తాపాన్ని వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశాడు. “నేను చాట్ చేస్తునప్పుడు నా మిత్రులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. అది అవాంఛితం కూడా. ఏదిఏమైనప్పటికీ ఓ బాధ్యతాయుత భారతీయుడిగా నేను అనుకోకుండా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారి భావాలను దెబ్బతీసి ఉంటే అందుకు నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను” అని పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News