Thursday, January 23, 2025

బిజేపిలోకి యువరాజ్ సింగ్?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ బిజేపిలో చేరనున్నారా? ఇటీవల యువరాజ్ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ఒక సభలో పాల్గొనడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.

యువరాజ్ సింగ్ ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కమలనాథులు రంగం సిద్ధం చేస్తున్నారు. అతనికి గురుదాస్ పూర్ లోక్ సభ టికెట్ ఇవ్వాలని బిజేపి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ నియోజకవర్గానికి ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రాతినిథ్యం వహించారు. బిజేపి తరఫున గురుదాస్ పూర్ నియోజకవర్గంనుంచి సెలబ్రిటీలు పోటీచేయడం ఆనవాయితీగా వస్తోంది. సన్నీడియోల్ కంటే ముందు ఇక్కడినుంచి దివంగత బాలీవుడ్ స్టార్ వినోద్ ఖన్నా గెలిచిన సంగతి తెలిసిందే. కాగా యువరాజ్ బిజేపిలో చేరే విషయమై పార్టీ వర్గాలు మౌనం పాటిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News