Friday, December 27, 2024

యువరాజ్ సింగ్-హాజెల్ కీచ్ దంపతులకు మగబిడ్డ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘అభిమానులు, కుటుంబం, స్నేహితులందరికీ, దేవుడు మాకు మగబిడ్డను ప్రసాదించాడని చెప్పడానికి మేం సంతోషిస్తున్నాం. మగబిడ్డను ప్రసాదించినందుకు  దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.’ అని యువరాజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Yuvraj Singh wife blessed with baby boy

కాగా, బ్రిటీష్-మారిషియస్ నటి, మోడల్ అయిన హాజెల్ కీచ్ ను యువరాజ్ 2016 వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల తర్వాత మొదటి సంతానం మగబిడ్డ పుట్టడంతో యువరాజ్ దంపతుల ఫ్యామిలీలో సంతోష వాతావరణం నెలకొంది. కాగా, టీమిండియా ఆటగాళ్లలో చాలా మందికి ఆడపిల్లలే పుట్టగా.. తాజాగా యువరాజ్ దంపతులకు మగ బిడ్డ జన్మించడంతో అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Yuvraj Singh wife blessed with baby boy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News