Wednesday, January 22, 2025

ఐపిఎల్ లో చాహల్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్ యుజ్వేంద్ర చహల్‌ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో 200 వికెట్స్ తీసిన ఒకే ఒక బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చాహల్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో మహ్మద్ నబీని ఔట్ చేసిన చాహల్ 200వ వికెట్ ను పూర్తి  చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 200వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. చాహల్ తర్వాత స్థానంలో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో(183 వికెట్లు) ఉన్నాడు.

కాగా, ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. ఓపెనర్ యశస్వి జైపాల్ (104,60 బంతుల్లో 9 పోర్లు,7 సిక్స్ లు) శతకంతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News