- Advertisement -
అమరావతి: వైసిపిలో పదవుల మార్పులపై టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్టు కాదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నాయకుల అవసరం బట్టి మరో చోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచన చేస్తుందని, పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని వివరించారు. వైసిపిలో ఎవరైనా చేరవచ్చని, పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చన్నారు. 95 శాతం హామీలను సిఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని స్పష్టం చేశారు.
- Advertisement -