Saturday, January 11, 2025

యశ్వంత్ సిన్హాకు జెడ్ క్యాటగిరి భద్రత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం సాయుధ సిఆర్‌పిఎఫ్ కమాండోలతో కూడిన జెడ్ క్యాటగిరి భద్రతను కల్పించింది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన 84 ఏళ్ల యశ్వంత్ సిన్హాకు భద్రతను సమకూర్చవలసిందిగా సిఆర్‌పిఎఫ్ విఐపి సెక్యూరిటీ విభాగాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఒక్కో షిఫ్టులో 8 నుంచి 10 మంది సాయుధ సిబ్బంది సిన్హాకు ఆయన దేశంలో ఏ ప్రాంతాన్ని పర్యటించినా భద్రతా వలయాన్ని కల్పిస్తారు. కాగా..ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కూడా అత్యున్నతమైన జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతను కేంద్రం సమకూర్చింది. యశ్వంత్ సిన్హా ఈ నెల 27న తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అనంతరం ఆయన తనకు అనుకూలంగా మద్దతు కోరుతూ దేశమంతటా పర్యటించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్థానంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జులై 18న ఎన్నికలు జరగనున్నాయి. జులై 21న ఫలితాలు వెలువడతాయి. జులై 24తో కోవింద్ పదవీకాలం ముగియనున్నది.

Z Category Security for Presidential Candidate Yashwant Sinha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News