Sunday, January 19, 2025

కేజ్రివాల్, మరి కొందరికి జైలు తప్పదు : జాఫర్ ఇస్లాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మద్యం కుంభకోణం కేసులో కొందరు ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపి జాఫర్ ఇస్లాం తెలిపారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా ఇప్పటికీ జైలులో ఉన్నారని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ సైతం త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.

కాంగ్రెస్, మజ్లిస్ పార్టీతో బిఆర్‌ఎస్‌కు అవగాహన ఉందని, బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియేనన్నారు. బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అవినీతి లేని పాలన అందించేది కేవలం బిజెపిమాత్రమేనన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News