టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తన అభిమానులకు శుభవార్త అందించారు. తన జీవితంలో ఆయన తండ్రిగా ప్రమోషన్ సాధించినట్లు వెల్లడించారు. పెళ్లి జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన భార్య సాగరికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాక.. తన కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెడుతున్నట్లు వెల్లడించారు.
కాగా, జహీర్‌ఖాన్, సాగరికాలు చాలా కాలం ప్రేమించుకున్నారు. 2016లో యువరాజ్ సింగ్ వివాహ వేడుకలో కలిసి కనిపించి వీరి ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత 2017లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం అయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు ఈ జంట. దీంతో సోషల్ మీడియాలో జహీర్ దంపతులకు సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకూ అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, జహీర్ ప్రస్తుతం ఐపిఎల్‌తో బిజీగా ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆయన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘చెక్ దే ఇండియా’ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. సాగరికా.. ఆ తర్వాత పలు హిందీ, మరాఠి సినిమాల్లో నటించారు.