Sunday, December 22, 2024

జహీరాబాద్ ఆర్‌టిసి డిపో ఎదుట బస్సు డ్రైవర్లు ధర్నా

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్‌టిసి డిపోలో అద్దె బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. జహీరాబాద్ డిపోలో 30 అద్దె బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. జహీరాబాద్ డిఎం తీరు సరిగా లేదంటూ డ్రైవర్లు ధర్నాకు దిగారు. అద్దె బస్సులు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో సర్వీసులు తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్, సంగారెడ్డి, బీదర్ మార్గాల్లో బస్సుల కొరత ఏర్పడింది. బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: డ్యాన్సు చేయనందుకు దంపతులను కత్తితో పొడిచాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News