Tuesday, March 4, 2025

నేను కొడితే మామూలుగా ఉండదు

- Advertisement -
- Advertisement -

ఎలా కొడతానో.. కాంగ్రెస్ నేతలకు తెలుసు
ఈ ప్రభుత్వాన్ని గంభీరంగా.. మౌనంగా
చూస్తున్నా.. తెలంగాణలో ప్రజలెవరూ
సంతోషంగా లేరు ఏడాదిలోనే ప్రభుత్వంపై
పెరిగిన వ్యతిరేకత రాష్ట్రాన్ని ఆర్థికంగా
దివాళా తీయించారు ప్రభుత్వ తీరుతో
భూముల ధరలు ఢమాల్
ఫిబ్రవరి చివరలో భారీ బహిరంగ సభ
రాబోయే కాలంలో బిఆర్‌ఎస్‌దే విజయం
రాష్ట్రంలో ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత
కాంగ్రెస్‌దే జహీరాబాద్ నియోజకవర్గ
కార్యకర్తలతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

మన తెలంగాణ/గజ్వేల్ జోన్: ‘రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగాలేరు..ఈ ప్రభుత్వాన్నిగంభీరం గా.. మౌనంగా చూస్తున్నా.. రాబోయే కాలంలో బిఆర్‌ఎస్‌దే విజయం..నేను దెబ్బకొడితే..మామూలుగా ఉండదు..ఆ విషయం కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు’ అని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యా ఖ్యానించారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాదయా త్ర ద్వారా సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవ ర్గం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై కీలక, సంచలన వ్యాఖ్యలు చే శారు.రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రా జెక్టులను ఎక్కడికక్కడ ఎండబెడుతున్నారని, ఎక్క డి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని ధ్వజమెత్తారు.సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు టెం డర్లు పిలవకుండా ప్రభుత్వం రైతులకు అ న్యాయయం చేస్తోందని మండిపడ్డారు.

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. ఈ ప్రాజెక్టుల నీటికోసం దండయాత్ర చేయాలని సమావేశంలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌కు సూ చించారు. తాను ఇంతకాలం గంభీరంగా, మౌ నంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని..తాను కొ డితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన కు అలవాటని.. అది ఎలా ఉంటుందో కాంగ్రెస్ కు బాగా తెలుసని తన అంతరంగంలో ఉన్న ఆగ్రహాన్ని కెసిఆర్ వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభపెడతామని ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం కావాలని కాం గ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెట్టారని, దా నికి బిఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని జనం ఓటేశారన్నారు. గత ఎన్నికల్లో తులం బంగారం ఇస్తారని అత్యాశకు పోయి జనం కాంగ్రెస్‌కు ఓట్లేశారన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంతగా వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే జనాలు కొట్టాలన్నంత ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలనపై రాష్ట్రం అంతటా అసంతృప్తి నెలకొందని, పాలనా వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులు పెడుతూ ప్రజల గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగా అమలు కావటం లేదని, పథకాలను అమలు చేయటం ఈ ప్రభుత్వానికి చేతకాదన్నారు. ప్రభుత్వ ఈ వైఖరితో కైలాసం ఆడితే పెద్దపాము మింగినట్లుగా ప్రజల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు వచ్చాయని, మంచినీటి కరువు వచ్చిందని, విద్యుత్ కోతలపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లకోసం ముస్లింలను వాడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని, భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయని చెప్పారు. గురుకులాల్లో పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నారని, పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదన్నారు. ప్రజలు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని, తెలంగాణ శక్తి ఏమిటో చూపించి కాంగ్రెస్ మెడలు వంచుతామన్నారు.

ఇందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని అన్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకున్నామని, రైతు బీమాతో ఎంతోమంది రైతులకు మేలు జరిగిందని అంటూ తమ హయాంలో రైతులకు జరిగిన ప్రయోజనాలను సోదాహరంగా వివరించారు. రైతుబంధుకి రాం రాం, దళిత బంధుకి జైభీం అంటారని కాంగ్రెస్ నిర్వాకంపై తాను ఆనాడే చెప్పానని కానీ ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, రాబోయే రోజుల్లో విజయం మనదేనని బిఆర్‌ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మాట్లాడితే ఫామ్‌హౌస్ అని భజన చేస్తూ బదునామ్ చేస్తున్నారని ఇక్కడ పంటలు తప్ప ఏముంటాయని ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నేత శ్రీధర్ దేశ్‌పాండే, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంఎల్‌ఎ సునీతా లకా్ష్మరెడ్డి, వి. ప్రకాష్ తదితరులతో పాటు కోహిర్, జహీరాబాద్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News