Saturday, November 2, 2024

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Zaheerabad hospital will be developed

సంగారెడ్డి: మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ కొనియాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 500 ఎల్ పిఎం ఆక్సిజన్ ప్లాంట్ ను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని, కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడిందని, కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామని గుర్తు చేశారు.  ఈ పరిస్థితి గమనించి‌ సిఎం కెసిఆర్ 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు.

ప్రస్తుతం‌ 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కి చేరుకున్నామని, మరో 2౦౦ మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని త్వరలో ఇది ప్రారంభమవుతుందని తెలియజేశారు.  రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదుని స్పష్టం చేశారు.  వైద్య రంగంలో‌గుణాత్మక మార్పులు తెచ్చామని,  కెసిఆర్ ఆదేశాల మేరకు‌ చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోందని,  రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గిందని, అయినా అలసత్వం వద్దు అని, అందరం మాస్క్ ధరించడంతో పాటు వాక్సిన్ వేయించుకుందామని హరీష్ రావు పిలుపునిచ్చారు.  దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని, ఆయన తొలి స్థానంలో నిలవాలని సూచించారు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తాం…

ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని‌‌ సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు.  ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసిహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు‌ చేస్తామని హామీ ఇచ్చారు. కెసిఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో‌ డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం‌ 52 శాతం ఉన్న డెలివరీలను 75 శాతానికి పెంచాలని సిబ్బందికి ఆదేశించారు.

జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలివరీలు బాగా జరుగుతున్నాయని, ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దని, దీని వల్ల‌ తొలి‌గంటలో శిశువుకు‌ అందాల్సిన అమృతమైన పాలు అందడం లేదన్నారు. దీని వల్ల‌ శిశువులో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. దాదాపు మన రాష్ట్రంలో‌ఇలా‌ 66 శాతం మంది‌ శిశువులకు తొలి‌గంటలో పాలు అందడం‌ లేదన్నారు. ఈ అనవసర సర్జరీల వల్ల‌ 35 ఏళ్లకే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని హరీష్ రావు తెలిపారు.  ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌ కింద ఏరియా ఆస్పత్రిలో‌ చికిత్సలు చేయాలని ఆదేశించారు. డిపార్ట్ మెంట్ వారీగా పని తీరును అడిగి‌ తెలుసుకున్నారు. మందుల‌ కొరత, నిధుల‌కొరత ప్రభుత్వం రానివ్వదని, చక్కటి‌ వైద్యం పేదలకు అందించాలని సిబ్బందికి‌ మంత్రి ‌సూచించారు. రోగులను ప్రేమగా పలకరించాలని, మర్యాదగా వ్యవహరించాలన్నారు. వృత్తిని, ఉద్యోగ ధర్మాన్ని మరిచిపోవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News