- Advertisement -
సంగారెడ్డి: కూలిపై విద్యుత్ తీగలు తెగిపడడంతో అతడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోపన్ పల్లికి చెందిన నర్సింహ్మా రెడ్డి గోవింద్ పూర్ లోని ఓ వ్యవసాయ క్షేత్రానికి పొలం పనులు చేయడానికి వెళ్లారు. ముళ్ల పొదలను అతడు నరుకుతుండగా అతడిపై 11 కెవి విద్యుత్ తీగ పడింది. నర్సింహ్మారెడ్డి అక్కడే సజీవదహనమయ్యాడు. విద్యుత్ శాఖ అధికాలు, వ్యవసాయ క్షేత్ర యజమాని డబ్బులు ఇవ్వాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -