Saturday, February 22, 2025

గద్దర్ మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు జహీర్ అలీఖాన్ కు కన్నీటి నివాళి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాయుద్ధనౌక గద్దర్ అంతియాత్రలో ఆయన మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, సియాసత్ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అంత్యక్రియలు మంగళవారం తెల్లవారు జామున నాంపల్లిలో జరిగాయి. సోమవారం గద్దర్ అంతిమయాత్రలో జహీరుద్దీన్ అలీఖాన్ పాల్గొన్నారు.

ఎల్బీనగర్ స్టేడియం నుంచి అల్వాన్ లోని గద్దర్ నివాసం వరకు అంతిమయాత్ర వాహనంలోనే వెళ్లిన జహీరుద్దీన్ అలీఖాన్.. వాహనం దిగిన తర్వాత భారీ జన సందోహంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మరింత విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News