Monday, December 23, 2024

జహీరుద్దీన్ మరణం పత్రికారంగానికి తీరని లోటు : నిరంజన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఆకస్మిక మరణము బాధాకరమని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ అన్నారు. ఆయన మరణము పత్రికా రంగానికి, తెలంగాణా ప్రజలకు తీరని లోటని నివాళులర్పించారు. తన తండ్రి ఆబిద్ అలీఖాన్ అడుగు జాడలలో నడుస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడుతూ, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొంటూ అంతిమ శ్వాస వదలడం అందరినీ కలిచి వేసిందన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News