Saturday, December 21, 2024

అమెరికాలో జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు… కళాకారుల సంగీత నివాళి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు గురువారం శాన్‌ఫ్రాన్సిస్కో లోని ఫెర్నవుడ్ శ్మశాన వాటికలో జరిగాయి. తమ అభిమాన సంగీత విద్వాంసునికి వందలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. డ్రమ్స్ మ్యాస్ట్రో శివమణి, మరికొందరు కళాకారులు సంగీత నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శివమణి కొంత దూరంలో డ్రమ్స్ వాయించారు.

“లయ అన్నది దైవం. అంటే మీరే జకీర్ భాయి. 1982 నుంచి ఇప్పటివరకు సాగిన మన సంగీత యాత్రలో నేను చాలా నేర్చుకున్నాను. నేను లయ విన్యాసం చేసిన ప్రతిసారి నీవుంటావు. మేం అమితంగా నిన్ను ప్రేమిస్తాం. ఇదే నా ప్రణామం”అని శివమణి పిటిఐ వీడియోలో నివాళి అర్పించారు. శాన్‌ఫ్రాన్సిస్కో లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ కె. శ్రీకార్ రెడ్డి కూడా జాకీర్‌కు నివాళి అర్పించారు. “ లెజెండ్రీ, తబలా మ్యేస్ట్రో, పద్మవిభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ ఫెర్నవుడ్ స్మశానంలో గురువారం మధ్యాహ్నం శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు” అని శ్రీకార్ రెడ్డి నివాళి అర్పించారు.

బారత ప్రభుత్వం, ప్రజల తరఫున కాన్సుల్ జనరల్ శ్రీకార్ రెడ్డి నివాళి అర్పించారని, బారత జాతీయ పతాకాన్ని జాకీర్ భౌతిక కాయంపై ఉంచారని, జాకీర్ భార్య ఆంటోనియా మిన్నెకోలా, ఇతర కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారని ప్రకటన పోస్ట్ అయింది. ప్రధాని మోడీ సంతాప సందేశం కూడా వినిపించారు. శివమణితో పాటు మరో 300 మంది సంగీతాభిమానులు, తుది నివాళి అర్పించారని ప్రకటన వెలువడింది. గ్రామీ విజేత సంగీత కళాకారుడు రికీ కేజ్ జాకీర్ హుస్సేన్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ జాకీర్ హుస్సేన్ ఈ నెల 16న తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News