Thursday, January 23, 2025

కర్నాటక కేబినెట్‌లో ఏకైక ముస్లిం జమీర్ అహ్మద్ ఖాన్!

- Advertisement -
- Advertisement -
జమీర్ అహ్మద్ ఖాన్ 2005 నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట అయిన చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కర్నాటక కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాట తర్వాత 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా, కెపిసిసి చీఫ్ డి.కె. శివకుమార్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. వారితో పాటు మరో ఎనిమిది మంది రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చామరాజ్‌పేట ఎంఎల్‌ఏ జమీర్ అహ్మద్ ఖాన్ కేబినెట్‌లో ఏకైక ముస్లిం సభ్యుడు.

బిజెపి అభ్యర్థి భాస్కర్ రావుపై 53,953 ఓట్ల తేడాతో ఖాన్ విజయం సాధించారు. చామరాజ్‌పేట్ నుంచి ఐదు సార్లు ఎంఎల్‌ఏగా గెలిచిన ఖాన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. ఖాన్ 2005 నుంచే చామరాజ్‌పేటకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన జెడి(ఎస్) టికెట్‌పైనే తొలిసారి శాసనసభ్యుడు అయ్యారు. నాడు కాంగ్రెస్ నాయకుడు ఎస్.ఎమ్.కృష్ణ గవర్నర్ పదవికి నామినేట్ కాగానే తన సీటును ఖాళీ చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఖాన్ జెడి(ఎస్) టికెట్‌పై శాసన సభ్యుడు అయ్యారు. ఖాన్ ఇదివరలో కూడా మంత్రిగా పనిచేశారు 2006లో జెడి(ఎస్), బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన హజ్, వక్ఫ్ బోర్డు మంత్రిగా పనిచేశారు. 2018లో జెడి(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుడ్, సివిల్ సప్లయ్స్, కన్జూమర్స్ అఫైర్స్ మంత్రిగా పనిచేశారు. ఆయన 2018లో జెడి(ఎస్) నుంచి బహిష్కృతుడు కాగా కాంగ్రెస్‌లో చేరారు. నాడు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసినందుకు ఖాన్‌ను, మరి ఏడుగురిని బహిష్కరించారు. కర్నాటకలో ముస్లిం సముదాయం 13 శాతం ఉంది. కర్నాటక అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం కేవలం 9 మాత్రమే. ఖాన్‌కు ముస్లింలలో మంచి పేరుంది. ప్రస్తుతం కర్నాటక విధాన సౌధలో 224 సీట్లుండగా, ముస్లింల ప్రాతినిధ్యం 4 శాతమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News