Wednesday, January 22, 2025

రూడ్‌కు ఝాంగ్ షాక్!

- Advertisement -
- Advertisement -

క్విటోవా ఇంటికి, వోజ్నియాకి, ఒస్టాపెంకో ముందంజ

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఐదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. చైనాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు ఝాంగ్‌తో జరిగిన ఐదు సెట్ల మారథాన్ పోరులో రూడ్ ఓటమి చవిచూశాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ఝాంగ్ 64, 57, 62, 06, 62 తేడాతో రూడ్‌ను మట్టికరిపించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఝాంగ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ టెలర్ ఫ్రిట్జ్ (అమెరికా) విజయం సాధించాడు. పేరూకు చెందిన జువాన్ పబ్లోతో జరిగిన రెండో రౌండ్‌లో ఫ్రిట్జ్ 61, 62, 62తో జయకేతనం ఎగుర వేశాడు.

Also Read: ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో ‘ఖుషి’

ప్రారంభం నుంచే ఫ్రిట్జ్ దూకుడుగా ఆడాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో అదరగొట్టిన ఫ్రిట్జ్ వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో పదో సీడ్ ఫ్రాన్సెస్ టియఫోయ్ (అమెరికా) విజయం సాధించాడు. ఆస్ట్రిలియాకు చెందినసెబాస్టియన్ ఓఫ్నర్‌తో జరిగిన రెండో రౌండ్‌లో టియఫోయ్ 63, 61, 64తో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన టియఫోయ్ అలవోక విజయంతో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అమెరికాకే చెందిన 14వ సీడ్ టామీ పాల్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో రష్యాకు చెందిన రోమన్ సఫియాన్‌ను ఓడించాడు. ఇతర పోటీల్లో 21వ సీడ్ ఫొకినా (స్పెయిన్), ఆస్ట్రేలియా ఆటగాడు హిజికటా, మెన్‌సిక్ (చెక్), షెల్టన్ (అమెరికా) తదితరులు విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు.
వోజ్నియాకి ముందుకు..

మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. డెన్మార్క్‌కు చెందని మాజీ నంబర్ కరోలైన్ వోజ్నియాకితో జరిగిన హోరాహోరీ పోరులో క్విటోవా ఓటమి చవిచూసింది. ఆసక్తికరంగా సాగిన పోరులో వోజ్నియాకి 75, 76తో క్విటోవాను ఓడించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.

మరో మ్యాచ్‌లో జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) విజయం సాధించింది. రష్యా క్రీడాకారిణి ఎలినాతో జరిగిన మూడు సెట్ల హోరాహోరీ పోరులో ఒస్టాపెంకో 63, 57, 75 తేడాతో జయభేరి మోగించింది. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బ్రాడీ విజయం సాధించింది. 24వ సీడ్ మాగ్దా లిన్నెట్ (పోలండ్)తో జరిగిన మూడు సెట్ల సమరంలో బ్రాడీ 61, 26, 62తో విజయాన్ని అందుకుంది. నాలుగో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్)కు రెండో రౌండ్‌లో వాకోవర్ లభించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి అజ్లా టొమిజానొవిక్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో రిబకినా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News