- Advertisement -
ఇస్లామాబాద్: ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ 14వ అధ్యక్షుడుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ తదుపరి దేశాధినేతగా అఖండ మెజారిటీతో ఎన్నికైన మరునాడు జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంఐవాన్ ఎ సదర్‌లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయీజ్ 68 ఏళ్ల జర్దారీతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ ఆరిఫ్ ఆల్వి స్థానంలో జర్దారీ బాధ్యతలు స్వీకరించారు.
డాక్టర్ ఆల్వి తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని 2023 సెప్టెంబర్‌లోనే పూర్తి చేసినప్పటికీ మరి ఐదు నెలల పాటు పదవిలో కొనసాగారు. జర్దారీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, మూడు సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.
- Advertisement -