Sunday, December 29, 2024

వచ్చే జన్మలోనైనా ప్రభాస్ నాకు కొడుకై పుట్టాలి: నటి జరీనా

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ నటి జరీనా వాహబ్ నటుడు ప్రభాస్ ను తెగ మెచ్చుకుంది. వచ్చే జన్మంటూ ఉంటే ప్రభాస్ తన కొడుకు కావాలంది. లెహ్రే టివి ఛానల్ తో ముచ్చటిస్తూ ఆమె ఈ విషయం చెప్పింది. ప్రభాస్ నటించిన ‘రాజా సాహెబ్’ సినిమాలో ఆమె కూడా నటిస్తోంది.

‘‘రాజా సాహెబ్  సినిమాలో నేనూ నటిస్తున్నాను. ఆ సినిమా మీరూ తప్పక చూడాలి. అభిషేక్ కిశోర్ ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రభాస్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు. చాలా మంచి వ్యక్తి. వచ్చే జన్మంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలని కోరుకుంటున్నాను. అందులో ఒకరు ప్రభాస్ అయితే, మరొకరు సూరజ్. ప్రభాస్ కు ఎలాంటి ఈగో ఉండదు’’ అంది జరినా వాహబ్.

‘‘ప్రభాస్ సెట్ లోకి చాలా క్యాజువల్ గా వస్తారు. రాజా సాహెబ్ సినిమాలో ముగ్గురు హిరోయిన్లు ఉన్నారు. కేరెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ప్యాకప్ అయ్యాక ప్రభాస్ అందరికీ బైబై చెబుతారు. ఆయనకు బై చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా అందరికీ చెబుతారు. తన పని అయిపోగానే, నెక్స్ట్ సీన్ కు ఆయన అక్కడ ఉండరు. తన వ్యాన్ లోకి కూడా వెళ్లిపోరు. ఆయన తన ఇంటికి ఫోన్ చేసి సెట్ లో ఉన్న అందరికీ అన్నం తెప్పిస్తారు. ఆయన ఓ మూలన కూర్చుంటారు. ఒకవేళ మీరు ఆయనతో ‘ఆకలిగా ఉంది’ అంటే, వెంటనే ఇంటికి ఫోన్ చేసి దాదాపు 40 నుంచి 50 మందికి సరిపడ అన్నం ఇంటి నుంచి తెప్పిస్తారు. మీకే కాదండోయ్… అక్కడ ఉన్న అందరికీ. అందరికీ అన్నం పెట్టిస్తానంటారు. నిజంగా ఆయన ఎంత మంచోడో. దేవుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి. నిజంగానే ఆయన అందరికీ డార్లింగే’’ అంటూ జరీనా వాహబ్ చెప్పుకొచ్చింది.

‘‘ప్రభాస్ తో పనిచేస్తానని నేనేనాడు అనుకోలేదు. తొలి రోజు నుంచే ఆయన నేను కంఫర్టేబుల్ గా ఉండేలా చూశారు. నన్నే కాదు. కొత్త హిరోయిన్లు కూడా కంఫర్టేబుల్ గా ఉండేలా చూశారు. ఆయన ఎప్పుడూ నవ్వు ముఖంతోనే మాట్లాడుతుంటారు. మేము ఏడు షెడ్యూళ్లకు కలిసి పనిచేశాము. ఆయన ఎవరితో చెడుగా ప్రవర్తించడం నేను చూడలేదు. గట్టిగా అరవడం కూడా చూడలేదు. చాలా ఎక్సలెంట్ వ్యక్తి ప్రభాస్’’ అని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News