Monday, January 20, 2025

జీ ఎంటర్‌టైన్‌మెంట్ సిబ్బందిలో సగం కోత

- Advertisement -
- Advertisement -

జీ ఎంటర్‌టైన్‌మెంట్ సిబ్బందిలో సగం కోత

ఖర్చుల తగ్గింపు ధ్యేయం

బెంగళూరు : బెంగళూరులోని తమ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌లో సిబ్బంది సంఖ్యను తగ్గించినట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది. ఖర్చుల తగ్గింపునకు సంస్థ ఏర్పాటు చేసిన సమీక్ష బృందం సిఫార్సుల మేరకు సిబ్బందిలో సగం మేర కోత విధించినట్లు సంస్థ తెలియజేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) పునీత్ గోయెంకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. జీ ఆంగ్ల భాష టివి చానెళ్లతో సహా తమ వ్యాపారాలలో నష్టాలను గణనీయంగా తగ్గించాలని, కీలక లాభం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతర విభాగాలలో ఖర్చులు కుదించుకోవాలని ‘3ఎం (మంత్లీ మేనేజ్‌మెంట్ మెంటార్‌షిప్) కార్యక్రమం ప్రత్యేక కమిటీ సూచించిందని సంస్థ తెలిపింది. ప్రత్యేక కమిటీలో సంస్థ చైర్మన్ ఆర్ గోపాలన్, ఆడిట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్ అగర్వాల్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News