Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌ను పునర్నిర్మించుకుంటాం

- Advertisement -
- Advertisement -

Zelensky has said that Ukraine will be rebuilt

ప్రతి పైసా రష్యానుంచి వసూలు చేస్తాం
దేశ పౌరులను అధ్యక్షుడు జెలెన్‌స్కీ భరోసా

కీవ్: రష్యా దాడుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకొని ఉక్రెయిన్‌ను పునర్నిర్మించుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. అందుకు అవసరమైన ప్రతి పైసాను రష్యానుంచే వసూలు చేస్తామని అన్నారు. రష్యా దాడులు నానాటికీ తీవ్రమవుతున్న వేళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జెలెన్‌స్కీ.. పౌరులకు ధైర్యం చెప్పారు. ‘వారు ( రష్యా) మమ్మల్ని నాశనం చేయాలని చాలా సార్లు ప్రయత్నించారు. కానీ అవి ఫలించలేదు. ఇప్పుడు కూడా ఈ దాడుల్లో మన ఆస్తులను ధ్వంసం చేశారు. కానీ యుద్ధం ముగిశాక ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి నగరాన్ని పునర్నిర్మించుకుంటాం. మేం రష్యాకు చెప్పేది ఒక్కటే. నష్టపరిహారం అనే పదాన్ని గుర్తుంచుకోండి. మీరు మా దేశంలో చేసిన విధ్వంసానికి , ఉక్రెయిన్ పౌరుడికి కలిగించిన ప్రతి నష్టానికి పూర్తి చెల్లింపులు చేయాల్సిందే’ అని జెలెన్‌స్కీ రష్యానుద్దేశించి తీవ్ర హెచ్చరిక చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలు, మూడు కరవులు, చెర్నోబిల్ పేలుడు, క్రిమియా ఆక్రమణ.. ఇలా ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని వాటినుంచి బయటపడ్డామని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ తెలిపారు. ఇవన్నీ చూశాక కూడా తాము భయపడిపోతామని, లొంగిపోతామని ఎవరైనా అనుకుంటే ఉక్రెయిన్ గురించి వారికేమీ తెలియదనే అర్థమని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News