Friday, November 22, 2024

దావోస్‌లో బిజీ బిజీగా జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌కు మద్దతు సమీకరణ యత్నాలు

దావోస్ : స్విస్ స్కీ రిసార్ట్ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) వార్షిక సమావేశం తొలి రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ బిజీ బిజీగా గడిపారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా, మధ్య ప్రాచ్యం, తదితర దేశాల ఉన్నత స్థాయి అధికారులు కూడా సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు. రష్యాతో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో తమ దేశ వైఖరి గురించి రాజకీయ నేతలకు విశదం చేసేందుకు జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు.

మరొక వైను హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం కూడా 100 రోజులు దాటింది. ఆ రెండు పోరులు ప్రపంచ దేశాల దృష్టిని విశేషంగా అకర్షించాయి. మరొక వైపు మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు విస్తృత స్థాయికి చేరగలవనే ఆందోళన వారిని పీడిస్తున్నది. జెలెన్‌స్కీ తాము సాగిస్తున్న పోరు గురించి ఖతార్, జోర్డాన్ ప్రధానులతో చర్చింనున్నారు.

మధ్యలో చైనా ప్రధాని లీ కియాంగ్, యూరోపియన్ కమిషణ చైర్‌పర్సన్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్, అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సులివాన్ సమావేశంలో ప్రసంగించనున్నారు. యుద్ధంతో సంక్షుభితంగా మారిన తమ దేశాన్ని వీడి విదేశాలకు ఆదిలో వెనుకాడిన జెలెన్‌స్కీ రష్యాకు వ్యతిరేకంగా తమ దేశానికి మద్దతు సమీకరించేందుకు విదేశీ పర్యటనలకు బయలుదేరారు. జెలెన్‌స్కీ సోమవారం స్విస్ రాజధాని బెర్న్‌లో అధ్యక్షుడు వయోలా ఆమ్‌హెర్డ్‌తో భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News