Thursday, December 19, 2024

రష్యా క్షిపణుల దాడిపై ప్రతీకారం తీవ్రం గానే ఉంటుంది : జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

ఎయింధోవెన్ : ఉక్రెయిన్ లోని చెర్నిహైవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణుల దాడిలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాలకు ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు వీడియో మెసేజ్ విడుదలైంది. ఆదివారం జెలెన్‌స్కీ నెదర్లాండ్స్‌కు విచ్చేశారు. రష్యా దాడులను ఎదుర్కోడానికి అత్యంత ఆధునిక ఎఫ్16 ఫైటర్ జెట్స్‌ను ఉక్రెయిన్ వైమానిక దళాలకు సరఫరా చేయడానికి డచ్,

డానిష్ దేశాలకు అమెరికా అంగీకరించడంతో జెలెన్‌స్కీ నెదర్లాండ్‌కు వచ్చారు. డచ్ లోని ఎయింధోవన్ నగరంలో మిలిటరీ వైమానిక స్థావరం వద్ద డచ్ ప్రధాని మార్క్ రుట్టెను జెలెన్‌స్కీ కలుసుకున్నారు. అంతకు ముందు జెలెన్‌స్కీ స్వీడన్ వెళ్లి వచ్చారు. ఉక్రెయిన్ పైలట్లకు ఈ నెల శిక్షణ ప్రారంభిస్తున్నామని డానిష్ రక్షణ మంత్రి జాకబ్ ఎలెమన్ శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News