Tuesday, January 21, 2025

రేపు హైదరాబాద్‌లో పగటి వింత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం ఓ అత్యద్భుతం జరుగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు జీరో షాడో పరిణామం చోటుచేసుకుంటుంది. స్థానిక బిఎం బిర్లా ప్లానిటోరియం సాంకేతిక అధికారి ఎన్ హరిబాబు శర్మ సంబంధిత విశేష ఖగోళ విషయాన్ని వివరించారు. సరిగ్గా ఈ మిట్టమధ్యాహ్న వేళ హైదరాబాద్‌పై సూర్య కిరణాలు నేరుగా వచ్చి పడుతాయి. రెండు నిమిషాలు సూరీడి కిరణాల ముఖాముఖి తాకిడి దశలో మనిషి నీడ కానీ, చెట్లు చేమల ఛాయలు కానీ నేలపై పడవని వివరించారు. సరిగ్గా 12.12 గంటల నుంచి 12.14 వరకూ ఈ వింతైన ఘటన జరుగుతుంది.

Also Read: పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం వార్నింగ్..

మనిషి ఈ దశలో బయటకు వచ్చి ఎండపొడకు నిలబడితే తన నీడ కన్పించని స్థితిని గ్రహిస్తాడు. ఏ వస్తువు అయినా సూర్య కిరణాలు పడే చోట 90 డిగ్రీల కోణంలో నిలబెడితే నీడలేని జాడలు గోచరిస్తాయి. ఇదే విధమైన జీరోషాడో ఘట్టం హైదరాబాద్‌లో ఆగస్టు 3న కూడా చోటు చేసుకుంటుంది. పలు ప్రాంతాలలో ఏదో ఒకసారి ఇటువంటి జీరోషాడో చోటుచేసుకుంటుందని శర్మ తెలిపారు. గతనెల 25వ తేదీన బెంగళూరులో ఈ ఖగోళ వింత జరిగింది. అప్పుడు అక్కడ మధ్యాహ్నం 12.17 గంటలకు ఈ నీడల్లేని పరిణామం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News