Sunday, November 17, 2024

నాగాలాండ్ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్

- Advertisement -
- Advertisement -

నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఓటర్లు తమ ఓటు బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. శుక్రవారం నాగాలాండ్‌లో ఆరు తూర్పు జిల్లాలో ఏ ఒక్క బూత్‌లోనూ ఒక్కటంటే ఒక్క ఓటు నమోదు కాలేదు. పోలింగ్ సిబ్బంది ఓపికగా దాదాపు తొమ్మిది గంటల పాటు వేచి చూసినా జనం రాకడ లేకుండా పోలింగ్ ఘడియలు గడిచిపోయ్యాయి. తమకు సరిహద్దు ప్రాంతపు నాగాలాండ్ (ఎఫ్‌ఎన్‌టి) ఏర్పాటు చేయాలని ఈ జిల్లాల వారు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ సాధనకు ఈ పోలింగ్ రోజును ఎంచుకుని హర్తాళ్ పిలుపు ఇచ్చారు. ఏడు గిరిజన సంస్థల సమ్మిళిత వేదిక ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఇఎన్‌పిఒ) పిలుపు ప్రభావంతో తూర్పు జిల్లాలలో జనజీవితం స్తంభించింది.

ఎక్కడా వాహన సంచారం లేదు. పలు వ్యాపార సంస్థలు కార్యాలయాలు మూతపడ్డాయి. కేవలం జిల్లా అధికార యంత్రాంగం, ఎమర్జెన్సీ విభాగాల వాహనాలే రోడ్లపై తిరుగుతూ కన్పించాయి. కాగా ఈ జిల్లాలోని 738 పోలింగ్ కేంద్రాలలో తమ సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకూ ఎదురుచూశారని అదనపు ఎన్నికల అధికారి అవా లోరింగ్ తెలిపారు. అయితే 20 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఈ జిల్లాల్లో చివరికి ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయలేదు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిఫియూ రియో స్పందిస్తూ ఈ ప్రాంత ప్రజల డిమాండ్ పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని , ఇప్పటికే డిమాండ్ మేరకు ఎఫ్‌ఎన్‌టి ఏర్పాటు ప్రక్రియ ఆరంభమైందని తెలిపారు. ఈ ప్రాంతానికి ముందుగానే స్వయం నిర్ణయాధికార ప్రతిపత్తి గురించి కేంద్రానికి సిఫార్సు కూడా చేశామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News