- Advertisement -
గగ్గోలు పెట్టిన మదుపరులు
న్యూఢిల్లీ: నేడు(సోమవారం) స్టాక్ మార్కెట్ షేర్లు అనూహ్యంగా పెరిగాయి. అయితే జిరోధా ట్రేడింగ్ యాప్ కైట్ మాత్రం టెక్నికల్ గ్లిచెస్ ఎదుర్కొంది. దాంతో అనేక మంది యూజర్లు ఎక్స్ ప్లాట్ ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేశారు.
స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయికి పెరిగినప్పుడు గ్లిచెస్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక ఈ గ్లిచెస్ రావడం యాదృచ్ఛికంగా జరిగింది. చాలా మంది జిరోధా డౌన్ డౌన్ అని, కొందరు పూర్ సర్వీస్ అంటూ గగ్గోలు పెట్టారు.
‘జిరోధా గ్లిచ్ కారణంగా నా ట్రేడింగ్ ఫండ్ మైనస్ 83 లక్షలు చూయించింది. నాకైతే ఈ రోజు ఉదయం గుండె ఆగినంత పనయింది’ అని ఒకరు అన్నారు. కాగా జిరోధా బ్రోకరేజ్ సంస్థ ఎక్స్ ప్లాట్ ఫామ్ లో ఫిర్యాదు చేసిన అందరికీ రెస్పాండ్ అయింది.
- Advertisement -