బెంగళూరు: నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా 30వ వార్షికోత్సవ సందర్భంగా ‘జిరోధా’ సిఈఓ నితిన్ కామత్ ట్విటర్ ద్వారా ఎన్‌ఎస్‌ఈ కి కృతజ్ఞతలు తెలిపారు. తమ కంపెనీ ఎన్‌ఎస్‌ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ‘నౌ ’(నీట్ ఆన్ వెబ్)కు చాలా రుణపడి ఉందన్నారు. “హ్యాపీ 30త్ ఎన్‌ఎస్‌ఈ ఇండియా” అంటూ ఆయన ట్వీట్ చేశారు. “ఎన్‌ఎస్‌ఈ నౌ…. 2009లో మొదటిసారి చూసినప్పటికీ నిన్ననే చూసినట్లనిపిస్తోంది. అది బ్రోకర్స్‌కి ఓ ఫ్రీ ప్లాట్‌ఫామ్. ఎన్‌ఎస్‌ఈ, నౌ అనేవే ఒకవేళ లేకుంటే నేడు జిరోధా ఉండేదే కాదు” అని నితిన్ కామత్ జోడించారు. తన ఎంటర్‌ప్రెన్యూర్ పయనంలో ఎన్‌ఎస్‌ఈ నౌ గురుతరమైన పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ చేపట్టేందుకు ఆయన తన ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. ఇప్పుడు జిరోధాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇండియా నాడు ఓ ఫ్రీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. అది నేడు ‘ఎన్‌ఎస్‌ఈ నౌ ’గా పిలువబడుతోంది అని ఆయన తెలిపారు.
Happy 30th @NSEIndia 🍾
Feels like yesterday when we first saw NSE NOW in 2009—the free platform NSE offered its brokers. This led to us questioning if tech is free, can we disrupt the pricing? An arbitrage trade. 😬@zerodhaonline wouldn't have happened if not for NSE & NOW.
— Nithin Kamath (@Nithin0dha) November 27, 2022