Monday, December 23, 2024

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో తొలిసారి ‘జిరోదా’ కామత్ సోదరులు!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఫోర్బ్స్ బిలియనీర్స్ 2023 జాబితా ఇటీవల విడుదలయింది. బిలియనీర్ల ర్యాంకుల్లో అమెరికన్లే డామినేట్ చేస్తున్నారు. 25 స్పాట్లలో 17 వారివే. అమెరికా తర్వాత ఫ్రాన్స్, భారత్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో రిలయన్స్ యజమాని ముకేశ్ అంబానీ తన స్థానాన్ని తిరిగి పొందారు. ఆయన ప్రపంచ పది మంది బిలియనీర్లలో ఒకరిగా ఉన్నారు. ఇదిలావుండగా అతి పెద్ద స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘జిరోదా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, ఆయన సోదరుడు, సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ మొదటిసారి ఈ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా(2023)లో చేరారు.

సిఈవో నితిన్ కామత్ జాబితాలో 1104 స్థానంలో ఉండగా, ఆయన సోదరుడు సిఎఫ్‌వో నిఖిల్ కామత్ 2405 స్థానంలో నిలిచారు. కామత్ సోదరుల నికర విలువ 2.7 బిలియన్ డాలర్లు. వారికి ‘ట్రూ బీకన్’ అనే ఓ ఫైనాన్షియల్ కంపెనీ కూడా ఉంది. నితిన్ కామత్ 2010లో జిరోదా బ్రోకరేజ్ కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక ముకేశ్ అంబానీ ఆస్తుల నికర విలువ 83.4 బిలియన్ డాలర్లు. అదానీ 47.2 బిలియన్ డాలర్లు, హెచ్‌సిఎల్ శివ నాడార్ 25.6 బిలియన్ డాలర్లు, సిరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా యజమాని సైరస్ పూనావాలా 22.6 బిలియన్ డాలర్లు, లక్ష్మీ మిట్టల్ 17.7 బిలియన్ డాలర్లు, సావిత్రి జిందాల్, ఆమె కుటుంబం 17.5 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నారు. వీరు ప్రపంచంలోని 100 మంది సంపన్నుల్లో ఒకరిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News