- Advertisement -
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కేసులు కొత్తగా మరో ఐదు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 28 కి చేరింది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇప్పటివరకు దీని నివారణకు సరైన మందు లేక పోవడం ఆందోళన కలిగించే విషయం. దీని బారిన పడిన వారిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు జికా వైరస్ సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో వైపు కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఆ రాష్ట్రం కలవరం చెందుతోంది.
Zika virus cases reaching 28 in Kerala
- Advertisement -