టౌన్స్‌విల్లే: ప్రపంచ క్రికెట్‌లో శనివారం పెను సంచలన ఫలితం నమోదైంది. పసికూనగా పేరు తెచ్చుకున్న జింబాబ్వే ప్రపంచ క్రికెట్ రారాజు ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది. శనివారం టోనీ ఐర్లాండ్ స్టేడియంలో జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇటీవలే భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ జింబాబ్వే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుక్ను విషయం తెలిసిందే. ఇక బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా విజయమే సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 31 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేసింది. జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. జింబాబ్వే బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వార్నర్ 94 పరుగులు చేశాడు. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్ 3 ఓవర్లలో పది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఎవన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరోవైపు జింబాబ్వే 39 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ మరుమాని (35), కెప్టెన్ రెగిస్ చకబ్వా(37 నాటౌట్) జట్టును గెలిపించారు.
ZIM Won by 3 Wickets Against AUS in 3rd ODI