Thursday, April 24, 2025

బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే మూడు వికెట్లు తేడాతో సంచలన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో జింబాబ్వే 174 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జింబాబ్వే టెస్టుల్లో తొలి విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో జింబాబ్వే అంచనాలకు మించి రాణించింది. ఆతిథ్య బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే పరిమితం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లాను 273 పరుగులకే కట్టడి చేసింది. కాగా, జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని సయితం ఛేదించింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (54), బెన్ కరన్ (44) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పిచ్‌కు బౌలింగ్‌కు సహకరిస్తున్న జింబాబ్వే బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు తీసిన ముజరబ్బానికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News