Friday, November 22, 2024

టీ20 సిరీస్ జింబాబ్వే కైవసం..

- Advertisement -
- Advertisement -

ఎడిన్‌బర్గ్: స్కాట్లాండ్‌తో ఆదివారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో జింబాబ్వే 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ మున్సె 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. బెర్రింగ్టన్ (44) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో మైక్‌లాయిడ్ అజేయంగా 39 పరుగులు చేయడంతో స్కాట్లాండ్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 19.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రెగిస్ చకబ్వా (25), క్రెగ్ ఎర్విన్ (25) శుభారంభం అందించారు. వెస్లీ మెదెవర్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 43 పరుగులు చేశాడు. మరోవైపు మిల్టన్ శుంబా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన మిల్టన్ 29 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వే మరో ఐదు బంతులు మిగిలివుండగానే సంచలన విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన జింబాబ్వే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Zimbabwe beat Scotland by 6 wickets in 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News