హరారే : ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో ఆతిథ్య జింబాబ్వే రికార్డు విజయం నమోదు చేసింది. సోమవారం అమెరికాతో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో జింబాబ్వే 304 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం. శ్రీలంకతో ఈ ఏడాది తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సాధించి 317 పరుగుల విజయం ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇక అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ సీన్ విలియమ్స్ 101 బంతుల్లోనే 21 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. ఓపెనర్ గుంబి (78), సికందర్ రజా (48), రియాన్ బుర్ల్ (47) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 25.1 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది.
Also Read: ఆస్ట్రేలియాదే యాషెస్