Sunday, January 5, 2025

231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి.. 16 పరుగులకే ఆలౌట్

- Advertisement -
- Advertisement -

టీ20లో మరో చెత్త రికార్డు నమోదైంది. ప్రత్యర్థి జట్టు విధించిన 231 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈగల్స్ జట్టు 16 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే దేశవాలీ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా డర్హమ్, ఈగల్స్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. డర్హమ్ జట్టు 20 ఓవర్లలో 230 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఈగల్.. 8.1 ఓవర్లలో 16 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. దీంతో టీ20 క్రికెట్ లో అత్యల్ప స్కోరు సాధించిన మూడో జట్టుగా ఈగల్ చెత్త రికార్డును నమోదు చేసింది. కాగా, టీ20లో స్పెయిన్ పై ఐల్ ఆఫ్ మ్యాన్ కేవలం 10 పరుగుల అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీథండర్స్ జట్టు 15 పరుగులకే ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News