Friday, December 20, 2024

పపంచంలోనే అత్యంత దయనీయ దేశం జింబాబ్వే!

- Advertisement -
- Advertisement -

న్యూయయార్క్: ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ప్రముఖ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే‘ వార్షిక దయనీయ సూచిక( హెచ్‌ఎఎంఐ)ప్రకారం అక్కడి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాలతో అతలాకుతలమవుతన్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్‌దేశాల్లోకంటే కూడా ఇక్కడి పరిస్థితులు దయనీయంగా ఉండడం గమనార్హం. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా 157 దేశాల్లో పరిస్థితిని అంచనా వేయగా రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలిస్థానంలో నిలిచినట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రిక తెలిపింది.‘ అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటిన నిరుద్యోగిత, అత్యధిక వడ్డీ రేట్లు, బలహీనమైన జిడిపి వృద్ధి..ఇలా అన్నీ కలిపి జింబాబ్వేను ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశాల జాబితాలో తొలిస్థానంలో నిలిపాయి.

ఇంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా?’ అని స్టీవ్ హాంకే వెల్లడించారు. అధికారంలో ఉన్న జాను పిఎఫ్ పార్టీతో పాటుగా అక్కడి ప్రభుత్వ విధానాలే జింబాబ్వేలో ఈ దుస్థితికి కారణమని జాన్ యూనివర్సిటీలో అప్లైడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హాంకే పేర్కొన్నారు. ఈ జాబితాలో వెనిజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు తొలి 15 దయనీయ దేశాల వరసలో ఉన్నాయి.మరో వైపు హెచ్‌ఎఎంఐ స్కోరును అతితక్కువగా పొందిన దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. అంటే అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నట్లు అర్థం. రెండో స్థానంలో కువైట్ ఉండగా, ఐర్లాండ్, జపాన్, మలేసియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో,మాల్టా దేశాలు తొలి పది స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ జాబితాలో భారత్ 103వ స్థానంలో ఉంది. మన దేశం దయనీయ స్థితిలో ఉండడానికి నిరుద్యోగం కారణమని తాజా నివేదిక పేర్కొంది. అమెరికా సైతం 134వ స్థానంలో ఉందని, ఇందుకు అక్కడి నిరుద్యోగమే ప్రధాన కారణమని పేర్కొంది. మరో వైపు వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్టులో వరసగా ఆరేళ్ల పాటు అగ్రస్థానంలో నిలిచిన ఫిన్లాండ్ ఈ జాబితాలో 109వ స్థానంలో నిలవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News