Monday, November 25, 2024

జింబాబ్వే నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

టి20లో 344 పరుగులతో ప్రపంచ రికార్డు

గాంబియాపై 290 తేడాతో ఘన విజయం

నైరొబి: టి20 ఫార్మాట్‌లో జింబాబ్వే పురుషుల జట్టు నయా చరిత్ర సృష్టించింది. టి20 వరల్డ్‌కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ప్రపంచ టి20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట అత్యధిక పరుగుల రికార్డు ఉండేది.

గతంలో 2023 ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా జింబాబ్వే ఈ రికార్డును తిరగరాసింది. అంతేగాక ప్రత్యర్థి టీమ్ గాంబియాను 290 పరుగుల తేడాతో చిత్తు చేసి మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. ఆండ్రి జార్జు 12(నాటౌట్) ఒక్కడే రెండంకెల స్కోరును అందుకున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్ నగరవా, బ్రాండన్ మవుటా మూడేసి వికెట్లను పడగొట్టారు.

సికందర్ విధ్వంసక శతకం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్లకు 344 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, మరుమాని జట్టు కు విధ్వంసక శుభారంభాన్ని అందించారు. సునామీ ఇన్నింగ్స్ ఆడిన మరుమాని 19 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 9 బౌండరీలతో 62 పరుగులు చేశాడు. బ్రియాన్ 26 బంతు ల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 98 పరుగులు జోడించి పెను సంచలనం సృష్టించారు. ఇక తర్వాత కెప్టెన్ సికందర్ రజా విధ్వంసక శతకంతో చెలరేగి పో యాడు.

గాంబియా బౌలర్లను హడలెత్తించిన రజా 43 బంతుల్లోనే 15 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రజాను కట్టడి చేయడంలో ప్రత్య ర్థి బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి బంతి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగి పో యిన రజా చారిత్రక బ్యాటింగ్‌తో జింబాబ్వే కు రికార్డు స్కోరును అందించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక క్లైవ్ మదాండె కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన క్లైవ్ 17 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ప్రత్యర్థి జట్టులో మూసా 4 ఓవర్లలో ఏకంగా 93 పరుగులు సమర్పించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News