- Advertisement -
హరారే: హరారే స్పోర్ట్ క్లబ్‌లో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 235 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. శర్మ 47 బంతుల్లో సెంచరీ చేసి మసకడ్జా బౌలింగ్‌లో డైన్ మైర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రుతు రాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 పరుగులు, రింకూ సింగ్ 22 బంతుల్లో 48 పరుగులతో ధాటిగా బ్యాటింగ్ చేశారు. శుభ్‌మన్ గిల్ రెండు పరుగులు చేసి ముజరబాని బౌలింగ్‌లో బెన్నెట్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. తొలి టి20లో జింబాబ్వే గెలిచింది.
- Advertisement -