- Advertisement -
హరారే: హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మూడో టి20లో టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ 28 బంతుల్లో 49 పరుగులు చేశాడు. భారత్ బ్యాట్స్ మెన్లలో శుభమన్ గిల్(66), రుతురాజ్ గైక్వాడ్(49), యశస్వి జైస్వాల్(36), అభిషేక్ శర్మ(10), సంజూ శామ్సన్(12) నాటౌట్, రింకూ సింగ్(1) నాటౌట్ పరుగులు చేశారు. సికిందర్ రాజా, ముజరబాని చెరో రెండు వికెట్లు తీశారు.
- Advertisement -