Monday, December 23, 2024

బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో జింబాబ్వే 17 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఆతిథ్‌య జింబాబ్వే 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సికందర్ రజా 65(నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

Zimbabwe won by 17 runs against Bangladesh in 1st T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News