Wednesday, January 22, 2025

పాక్‌కు జింబాబ్వే షాక్

- Advertisement -
- Advertisement -

Zimbabwe won on Pakistan

 

ఆస్ట్రేలియా: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా పెర్త్ స్టేడియంలో  జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్‌పై జింబాబ్వే గెలిచింది. ఒక్క పరుగుతో జింబాబ్వే విజయం సాధించింది. జింబాబ్వే జట్టు పాకిస్తాన్ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో పాకిస్థాన్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ రెండు వికెట్లు, బ్లెసింగ్ ముజరబాని, లుకె జోంగ్వే చెరో ఒక వికెట్ తీశారు. పాక్ బ్యాట్స్ మెన్ మసూద్ 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లలో నవాజ్(22), రిజ్వాన్(14), షాదాబ్ ఖాన్(17), వసీమ్(12) మిగిలిన బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మూడు వికెట్లు తీసిన సికిందర్ రాజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News