Saturday, December 21, 2024

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ ష్ట్రీక్ మృతి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జింబాబ్వే మాజీ సారధి హీత్ ష్ట్రీక్ కన్నుమూశాడు. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ స్టార్ ఆటగాడు ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 49 ఏళ్ల స్టార్ ఆటగాడు మృతి చెందడంతో ప్రపంచ క్రికెట్ అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ష్ట్రీక్ మృతికి క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, 14 ఏళ్లుగా ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో అంతర్జాతీయంగా 65 టెస్టులు, 189 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

రెండు ఫార్మాట్లలో కలిపి 4,933 పరుగులు, 455 వికెట్లు పడగొట్టాడు. అయితే హీత్ ష్ట్రీక్ జట్టులో కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇక 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి.. జింబా బ్వే తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. చివరిసారిగా 2005లో భారత్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు ష్ట్రీక్. తర్వాత క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. ఆ తర్వాత 2016-2018 కాలంలో జింబాబ్వే జట్టుతో పాటు దేళవాళీ లీగ్‌ల్లో ఆయా జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గానూ ష్ట్రీక్ పనిచేశాడు.

Also Read: వర్షంతో మ్యాచ్ రద్దయినా ముందుకే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News