Monday, December 23, 2024

జోయిటిస్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికా ప ర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం శనివారం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జొయిటిస్ కంపెనీని సందర్శించిం ది. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్‌ఫోర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. ప్రపంచంలో ప్ర ముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జో యిటిస్ కంపెనీ హైదరాబాద్‌లోని కేపబులిటీ సెంటర్ విస్తరించాలని నిర్ణయించింది. ఈ సెప్టెంబర్ నుంచి ఈ విస్తరణ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబులతో పాటు అ ధికారుల బృందంతో ఈ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో తమ జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృ ద్ధికి అపారమైన అవకాశాలున్నాయని ఆయ న అన్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి లై ఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జో యిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్ మరిం త గుర్తింపు తెస్తుందని సిఎం అన్నారు.

కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతం
ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్ర భుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషం గా ఉందని జోయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేష న్ ఆఫీసర్ కీత్ సర్బాగ్ అన్నారు. తమ కం పెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధిం చి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు.హైదరాబాద్‌లో అం దుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వ నరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే సేవలందించటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు.

కంపెనీ విస్తరణకు సహకారం అందిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
జోయిటిస్ కంపెనీ విస్తరణ తెలంగాణలో ఉన్న వనరులు, తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు. జోయిటిస్ కంపెనీ దాదాపు 70 సంవత్సరాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, నిరోధించే మార్గాలు, చికిత్స సంబంధిత అంశాలపై పని చేస్తోందన్నారు. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ఔషధాలతో పాటు వ్యాక్సిన్లు, రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత, ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలు అందిస్తోందని మంత్రి తెలిపారు.

తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు సెంటర్ ఫర్ బయోడిజైన్ ఆసక్తి
ముఖ్యమంత్రి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో బయోడిజైన్ స్టాన్ ఫోర్డ్ బైర్స్ సెంటర్ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ బయోడిజైన్ తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించింది. సమావేశంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణ, విద్య, నైపుణ్యాభివృద్ధిలో సహకారం, తెలంగాణలో రాబోయే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, కొత్త లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీ స్థాపనలో భాగస్వామ్యాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలపై ముఖ్యమంత్రి బృందంతో చర్చించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలన్న అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. అలాగే నాలెడ్జ్ మార్పిడి, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ కోసం శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించారు.

సిఎంకు బయోడిజైన్ టీం లేఖ..
తెలంగాణలో స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకాడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ లేఖలో వారు ప్రస్తావించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు.

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీతో భాగస్వామ్యం యువత భవితకు కొత్త బాటలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యం కోరినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవలప్‌మెంట్ లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందన్నారు.

గూగుల్ క్యాంపస్ పర్యటన
కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా వినియోగించుకోవచ్చన్న అంశాలపై గూగుల్ ప్రతినిధులతో సిఎం చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News