Wednesday, January 22, 2025

గుర్రంపై పుడ్ డెలివరీ చేసిన డెలివరీ బాయ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పుడ్ డెలివరీ బాయ్ గుర్రం మీద పుడ్ డెలివరీ చేసిన సంఘటనా హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కేంద్రం కొత్తగా తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్లు నిన్నటి నుండి ఆకస్మిక సమ్మెకు దిగారు. ఆయిల్ కంపెనీల వద్ద ఎక్కడి ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి.ఈ కారణంగా తెలుగు రా ష్ట్రాల్లో పె ట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. తెలంగాణలో నూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె కు దిగడంతో రాష్ట్రంలో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.

రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఉరుకులు పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం నుంచే డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్స్ నిలిపివేశారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ కోసం బంక్ వద్ద లైన్ లో నిలబడిన జొమాటో డెలివరీ బాయ్ విసుగుచెంది తన బైక్ ను పక్కన పెట్టి గుర్రం పై వెళ్లి పుడ్ డెలివరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని చంచల్ గూడ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News