Sunday, December 22, 2024

జోరుగా హుషారుగా: ఖరీదైన స్పోర్ట్స్ కారు కొన్న జోమాటో సిఇఓ!

- Advertisement -
- Advertisement -

డబ్బుంటే కొండ మీద కోతి అయినా దిగివస్తుంది! లగ్జరీ కారు కొనుక్కోవడం ఓ లెక్కా? జోమాటో సిఇఓ దీపీందర్ గోయల్ యువకుడు. పైగా కావలసినంత డబ్బుంది. ఇంకేం? అతను తాజాగా ఓ స్టోర్ట్స్ కారును తెప్పించుకున్నాడు. ఇండియాలోకి వచ్చిన అతి ఖరీదైన స్పోర్ట్స్ కారు ఇదే కావడం విశేషం. దీని ధర తెలిస్తే ఎవరైనా షాక్ కు గురి కావడం ఖాయం.

బ్రిటన్ కు చెందిన ఆస్టన్ మార్టిన్ కొత్తగా మార్కెట్లోకి డిబి12 అనే మోడల్ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ఆ కారును చూస్తే కళ్లు చెదిరిపోతాయంతే! ఇక నడిపితే ఆ మజాయే వేరు. దీన్ని దీపీందర్ 4.59 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడట. ఈ కారు గురించిన వివరాలను గోయల్ ఇన్ స్టాలో షేర్ చేశాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి ఆస్టన్ మార్టిన్ డిబి12 కారని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు! గోయల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News