Monday, December 23, 2024

225 పట్టణాల్లో జొమాటో సేవలు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో 225 చిన్న పట్టణాల్లో సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే సందర్భంగా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. నష్టాలు పెరిగిన కారణంగా అనేక పట్టణాల్లో సేవలను నిలిపివేయాలని నిర్ణయించామని, ఈ పట్టణాల్లో వ్యాపారం ఆశించినరీతిలో లేదని జొమాటో పేర్కొంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం క్షీణించడం వల్ల డిసెంబర్ ముగింపు మూడో త్రైమాసికంలో కంపెనీకి రూ.346.60 కోట్ల నష్టం వచ్చింది.

‘డిమాండ్‌లో ప్రస్తుత మందగమనం ఊహించనిది. ఇది ఫుడ్ డెలివరీలో వృద్ధిపై ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ సంస్థ లాభదాయకతను చేరుకోవడం మంచి స్థానంలో ఉన్నామని భావిస్తున్నాం’ అని కంపెనీ క్యూ3 ఫలితాల సందర్భంగా వెల్లడించింది. జొమాటో ఇటీవల గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించి, మరో 800 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. కానీ ఇప్పుడేమో 225 పట్టణాల్లో సేవలు నిలిపివేయనున్నామని ప్రకటించడం ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News