Saturday, November 23, 2024

జొమాటోకు స్వస్తి పలికిన గౌరవ్ గుప్తా

- Advertisement -
- Advertisement -

సహవ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా

Zomato co founder gaurav gupta resigned

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్- జోమాటోలో సహవ్యవస్థాపకుడైన గౌరవ్ గుప్తా రాజీనామాచేశారు. జులైలో ఆ కంపెనీ ఐపిఒ విడుదల చేసిన సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. “నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నాను. జొమాటోలో గత 6 ఏళ్లుగా పనిచేసిన అనుభవం నా ఈ కొత్త అధ్యయనానికి చాలా నిర్వచనం చెప్పగలదు. జొమాటోను ముందుకు తీసుకెళ్లడానికి గొప్ప టీమ్ ఉంది. నా పయన మార్గంలో నేను ఓ ప్రత్యయనాన్ని చేపట్టబోతున్నాను” అని గుప్తా తెలిపారు. తనను ఇంకా ఎక్కువ ఏమి అడగవద్దని, తన అనుభవానికి తాను ఎంతగానో అందరికీ ఋణపడి ఉన్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తన చుట్టూ ఉన్నవారు తాను మరింత మెరుగైన మనిషిగా మారేందుకు ఎంతగానో తోడ ్పడ్డారని చెప్పారు. తన పయనంలో భాగస్వామిని చేసుకున్న జొమాటో కంపెనీ వ్యవస్థాపకుడు, సిఇఒ దీపిందర్ గోయల్‌కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ్ గుప్తా 2019లో జొమాటోలో సహవ్యవస్థాపకుడు, సప్లై ఫంక్షన్ హెడ్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా జొమాటో షేరు ధర ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజీలో రూ. 144.60 వద్ద ట్రేడవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News