Thursday, January 23, 2025

జొమాటో సహ వ్యవస్థాపకుడు గుంజన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సహ వ్యవస్థాపకుడు, సిటిఒ(చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) గుంజన్ పాటిదార్ రాజీనామా చేశారు. ఈమేరకు కంపెనీ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీ ప్రారంభం నుంచి జొమాటోతో కలిసి పనిచేస్తున్న పాటిదార్, ఈ సంస్థ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. గత పదేళ్ల కాలంలో ఆయన అద్భుత సామర్థంతో కూడిన టెక్ నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేశారని, జొమాటో నిర్మాణంలో ఆయన సేవలు ఎంతో అమూల్యమైనవని కంపెనీ ప్రకటన చేసింది. కంపెనీ నుంచి ముగ్గురు ఉన్నతాధికారులు ఇప్పటికే రాజీనామా చేశారు.

పాటిదార్‌కు కొన్ని వారాల ముందు కంపెనీకి చెందిన మరో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా కూడా రాజీనామా చేశారు. మోహిత్ కంటే ముందు, జొమాటో కొత్త ఇనిషియేటివ్స్ హెడ్, మాజీ ఫుడ్ డెలివరీ చీఫ్ రాహుల్ గంజు, దాని ఇంటర్‌సిటీ లీజ్డ్ సర్వీసెస్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్ కూడా ఇటీవలే కంపెనీకి రాజీనామా చేశారు. నివేదికల ప్రకారం, ఉత్పత్తి, టెక్, కేటలాగ్ మార్కెటింగ్ వంటి ఫంక్షన్లలో కంపెనీ ఇప్పటికే కనీసం 100 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుత జొమాటోలో దాదాపు 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మహమ్మారి కారణంగా వ్యాపారంలో మందగమనం కారణంగా కంపెనీ తన 4,320 మంది సిబ్బందిలో 13 శాతం మందిని అంటే 550 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News