Sunday, December 22, 2024

జోమాటో నుంచి కొత్త ఫీచర్

- Advertisement -
- Advertisement -

ఆకలి వేస్తే వండుకోనవసరం లేకుండా చిటికెలో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసే సదుపాయం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వల్ల వచ్చింది. మార్కెట్లో ప్రస్తుతం స్విగ్గీ, జోమాటోలదే రాజ్యం. ఈమధ్య కాలంలో అత్యధిక లాభాలు సాధిస్తున్న జోమాటో యాప్‌లోను వినూత్న ఫీచర్లు తీసుకువస్తూ ఆకట్టుకుంటున్నది. ఇటీవలే ఈ సంస్థ యాప్‌తోనే యుపిఐ చెల్లింపులు జరిపే ఫీచర్ తీసుకువచ్చి చిల్లర బాధలు లేకుండా చేసింది. జోమాటో తాజాగా మరొక ఫీచర్‌తో ముందుకు వచ్చింది. స్నేహితులంతా ఒక చోట చేరితే వారికి ఇష్టాయిష్టాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. వారికి ఇష్టమైన ఫుడ్ ఏమిటో కనుక్కుని ఆర్డర్ పెడుతుంటారు. అయితే, ప్రతి సారి ఇలా అందరినీ కనుక్కుని ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జోమాటో గ్రూప్ ఆర్డరింగ్ పేరుతో ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా అందరూ కలసి నచ్చినఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలు కల్పించేలా ఈ ఫీచర్ ఉంది. జోమాటో సిఇఒ దీపిందర్ గోయల్ ఫీచర్ విశేషాలను ‘ఎక్స్’లో తెలిపారు. గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్ సహాయంతో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో కార్ట్‌లో మీ స్నేహితులు అందరినీ భాగస్వామ్యం చేయవచ్చు. దీని కోసం గ్రూప్ ఆర్డర్‌లో ఉండే లింక్‌ను వారికి పంపాలి. దానితో ప్రతి ఒక్కరు నచ్చిన ఫుడ్‌ను కార్ట్‌లో యాడ్ చేస్తారు. దీనితో ఎవరికి నచ్చిన ఫుడ్‌ను వారే స్వయంగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికైతే ఈ ఫీచర్ కొందరికే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి తెస్తామని దీపిందర్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News