Thursday, January 23, 2025

సులభతర పాలన కోసం జోన్ కార్యాలయం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : నగరంలో ప్రజల సౌకర్యార్థం నూతనంగా అర్సపల్లిలో నగర పాలక సంస్థ 5వ జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని ఆటోనగర్‌లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 5వ జోన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు మరింత అందుబాటులోకి తేవాలనే లక్షంతో ప్రభుత్వం పాలనను ప్రజలవద్దకు తెస్తోందని అన్నారు. నగర అభివృద్ధిలో జోన్ కార్యాలయాలు ప్రజలకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

జోన్ పరిధిలో సంబంధిత అధికారులు, కార్పొరేటర్లు, సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను సత్వర పరిష్కారానికి తమవంతు సహాయసహయారాలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్, కొర్పారేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News