Thursday, December 26, 2024

20 ఏళ్ల బంధం ఈ రోజుతో తెగిపోయింది…

- Advertisement -
- Advertisement -

అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో స్మిత్ సోనియన్స్ జాతీయ జంతు ప్రదర్శన శాల (జూ) ఉంది. అందులో ఉండే ఓ కొంగ గురించి ఆ ప్రాంతంలో తెలియనివారు లేరు. దాని పేరు వాల్ నట్. అది మిగతా కొంగలతో కలవకుండా తనకు రోజూ ఆహారం పెట్టే కిమ్ క్రోవీ అనే జూ కీపర్ తో స్నేహం చేసింది. వారిద్దరి స్నేహం రెండు దశాబ్దాలపాటు కొనసాగింది. అయితే వాల్ నట్ ఈనెల 2న కన్నుమూసింది.

అంతరించి పోతున్న తెల్ల మెడ గల కొంగల జాతికి చెందిన వాల్ నట్ స్వభావం విచిత్రంగా ఉండేది. జూ కీపర్ క్రిస్ వస్తే చాలు ఆనందంగా డాన్స్ చేసేది. అతను పెడితేనే ఆహారం తీసుకునేది. వారిద్దరూ కలసి ఉన్నప్పుడు చూడాలని అనేకమంది జూకి వచ్చేవారు. సాధారణంగా ఈ జాతికి చెందిన కొంగలు 15 ఏళ్లకు మించి బతకవు. కానీ వాల్ నట్ 42 ఏళ్లు బతకడం విశేషమని జంతు శాస్త్రజ్ఞులు అంటున్నారు.

నాలుగు రోజులుగా వాల్ నట్ ఆహారం ముట్టకపోవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. నెక్రోప్సీ (జంతువులకు చేసే శవపరీక్ష)లో రీనల్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినట్లు తేలింది.

వాల్ నట్ మృతికి జూ సిబ్బంది మౌనం పాటించారు. క్రిస్ మాట్లాడుతూ వాల్ నట్ తో తనకు గల అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోలేనన్నాడు. వాల్ నట్ మృతి గురించి తెలిసిన నెటిజన్లు దాని మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News